రాష్ట్రంలో రైతులు పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన దృష్ట్యా... ఎరువులు, విత్తనాలు విషయంలో కొరత రాకుండా చూడాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాల వారీగా విత్తనాలు, ఎరువులకు డిమాండ్, ప్రస్తుత నిల్వలు ఎంత అవసరం ఉంటుందనే అంశాలను పరిశీలించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సరఫరా విషయంలో ప్రాథమిక సహకార సంఘం, మార్క్‌ఫెడ్ శాఖల వద్ద ఎలాంటి జాప్యం జరగకూడదని అన్నారు. ఖరీఫ్ పంటకాలంపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్ విత్తన సంస్థల ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తోన్న నకిలీ ఎరువుల నివారణకు కలెక్టర్ల సహకారంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటలు చీడల బారిన పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. భూసార పరీక్షలకు సంబంధించిన పరీక్ష కార్డులు సంబంధిత రైతులకు 15 రోజుల్లో అందజేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రైతు సమగ్ర సమాచారం వెంటనే అప్‌లోడ్ చేయాలని మంత్రి అదేశించారు.
ఇదీ చూడండి : 'పురాతన కట్టడాలను తొలగించాలని ఎక్కడ పేర్కొన్నారు'