TSRTC and Hyderabad Metro Agreement: హైదరాబాద్‌లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ, మెట్రో పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అంగీకారంతో మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఆర్టీసీ బస్సులను నడపనుంది. అంతే కాకుండా మెట్రో రైలు దిగగానే బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. దీనికి సంబంధించి మెట్రో స్టేషన్ల వద్ద బస్సుల సమయపట్టిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
దీనితో పాటు సమాచార కేంద్రాలు, మైక్ ద్వారా అనౌన్స్‌మెంట్ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎల్అండ్టీ మెట్రో చీఫ్ స్ట్రాటజీ అధికారి మురళీ వరదరాజన్ శనివారం బస్‌భవన్‌లో ఒప్పందం చేసుకున్నారు నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత పటిష్ట పర్చడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని సజ్జనార్ తెలిపారు.
ఇవీ చదవండి: ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు.. అందువల్లే ఆలస్యం: సీఈవో
ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు