Agniveer Training Program: గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో అగ్నివీర్‌ల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి ఒకటో తేదీన ప్రారంభమైన ఈ శిక్షణలో దాదాపు 2300 మంది శిక్షణ తీసుకుంటున్నారు. 31వారాల కఠిన శిక్షణ తర్వాత అగ్నివీర్‌లు దేశానికి సేవ అందించనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు ప్రస్తుతం సైనిక శిక్షణ పొందుతున్నారు. అగ్నివీరులుగా పిలవబడే ఈ సైనికులకు పలు దఫాలుగా తీర్చిదిద్దనున్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్, మూర్తిమత్వం, దేహదారుడ్యాన్ని తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తున్నారు. తుపాకీ వినియోగంలోని తర్పీధునిస్తున్నారు. అగ్నివీరులను ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా నియామక ర్యాలీ నిర్వహించారు. పరుగు పందెం, దేహ దారుడ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్ ముగిసిన తర్వాత అర్హత పరీక్ష నిర్వహించారు. అన్నింటిలోనూ అర్హత సాధించిన అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేసి ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ఆర్మీ కేంద్రాలలో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
"ప్రస్తుతం ఆర్టిలరీ సెంటర్‌కి 2300 మంది అగ్నివీరులు శిక్షణకు వచ్చారు. ఫిబ్రవరి నెల మధ్యలో మరో 3200 మంది రానున్నారు. వారికి మార్చి 1వ తేదీన నుంచి శిక్షణ ప్రారంభిస్తాం. ఈ సెంటర్‌లో మెుత్తం 5500 అగ్నివీరులకు శిక్షణ ఇవ్వనున్నాం." -రాజీవ్ చౌహాన్, కమాండెంట్ గోల్కొండ ఆర్టిలరీ సెంటర్
ఇవీ చదవండి: