ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ముధులిక ఇన్ఫెక్షన్తో బాధపడుతోందని ఆమె తండ్రి రాము చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఇంటర్ పరీక్షలపై ఆందోళన చెందొద్దని మనోధైర్యాన్నిచ్చారు. ఎప్పుడు కోలుకుంటే అప్పుడే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం వ్యక్తం చేశారని మధులిక తండ్రి రాము తెలిపారు. బాధితురాలి వైద్యంకోసం ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేశ్ యశోద ఆస్పత్రి మేనెజింగ్ డైరెక్టర్‌కు అందజేశారు.
మధులిక కోలుకున్న తర్వాతే పరీక్షలు - RAMU
బర్కత్‌పురా దాడి ఘటనలో బాధిత బాలిక హెల్త్ బులిటెన్ విడుదలైంది. మధులికకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆమె తండ్రి రాము స్పష్టం చేశారు. బాలిక ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు.