తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రానికి ఏవియేషన్, ఎరో స్పేస్లు ప్రాధాన్య రంగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2020 ప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఎరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు.
" రాష్ట్రంలో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదనలు అందించాం. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు అవకాశాలున్నాయి. వరంగల్ విమానాశ్రయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చి, కనెక్టివిటీ స్కీం, ఉటాన్ స్కీంతో అనుసంధానించేందుకు యోచిస్తున్నాం"
-మంత్రి కేటీఆర్
- ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్