ETV Bharat / state

HRC: న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలంటూ హెచ్​ఆర్​సీకి అభ్యర్థన

దిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనుమతించినట్లుగా తెలంగాణలోనూ న్యాయవాదులకు లాక్​ డౌన్(Lock Down)​​ నుంచి మినహాయింపులు ఇవ్వాలని... న్యాయవాది సి.కోమిరెడ్డి రాష్ట్ర మానవహక్కుల కమిషన్​(HRC)ను అభ్యర్థించారు. కేసులకు సంబంధించి పత్రాలు సిద్ధం చేయాలంటే కార్యాలయాలకు వెళ్లక తప్పడం లేదన్నారు.

HRC: న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలంటూ హెచ్​ఆర్​సీకి అభ్యర్థన
HRC: న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలంటూ హెచ్​ఆర్​సీకి అభ్యర్థన
author img

By

Published : May 28, 2021, 4:52 PM IST

లాక్​డౌన్(Lock Down)​ నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాది సి.కోమిరెడ్డి రాష్ట్ర మానవహక్కుల కమిషన్​(HRC)ను కోరారు. మే 12 నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు ప్రొసీడింగ్స్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతున్నా ... ఆయా కేసులకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలంటే న్యాయవాదులు కచ్చితంగా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన తన అభ్యర్థన పత్రంలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో కార్యాలయాలకు వెళ్లే న్యాయవాదులు, వారి గుమస్తాలను పోలీసులు అడ్డుకుంటుండటంతో... ఇబ్బందులు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ, దిల్లీ తదితర రాష్ట్రాల్లో ఇచ్చినట్లుగా తెలంగాణలో కూడా న్యాయవాదులు, గుమస్తాలకు మినహాయింపు ఇచ్చేలా... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలకు తగిన సూచనలు చేయాలని కోరారు.

ఇందుకు సంబంధించి తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ద్వారా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రాలను ఇప్పటికే అందించామన్నారు. వెంటనే స్పందించిన కమిషన్... న్యాయవాది కోమిరెడ్డి, బార్ కౌన్సిల్ ద్వారా సమర్పించిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా చర్యలు చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: అపోలో ఆస్పత్రుల్లో స్పుత్నిక్-వి ధర ఎంతంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.