సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల పరిధిలో ‘సురక్షిత నగరం’ ప్రాజెక్టు కింద దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెయి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏకకాలంలో 2,000 కెమెరాల్ని వీక్షించే సదుపాయం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలోనే దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజులపాటు నిక్షిప్తం చేసి ఉంచేలా భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, షీ టీమ్స్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ