Supreme Court on the Disha Encounter case
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పరిశీలించాకే విచారిస్తామని సీజేఐ బెంచ్ పేర్కొంది. 2019 డిసెంబర్‌లో సిర్పూర్కర్ కమిషన్‌ను సీజేఐ బెంచ్ ఏర్పాటు చేసింది. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆరోపణల వల్ల విచారణ కమిషన్ ఏర్పాటైంది. ఈ ఏడాది జనవరి 30న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
ఈ నేపథ్యంలోనే దిశ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది. నివేదికను పరిశీలించాకే విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. కరోనా వల్ల కమిషన్ విచారణ నివేదిక ఆలస్యమైంది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. జనవరి 28న సుప్రీంకు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది.
Disha Culprits Encounter : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులు విచారణ సమయంలో పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్ చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసుపై రాచకొండ సీపీ ఛైర్మన్‌గా సిట్ కూడా ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు.. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది.
Disha Culprits Encounter Case : 2019 డిసెంబరు 6న... దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాయారు. ఆ ఎన్‌కౌంటర్ జరిగిన విధానంపై నిజనిర్ధారణ చేసేందుకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. నిందితుల కుటుంబసభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది.
సంబంధిత కథనాలు :
- Sirpurkar Commission : చటాన్‌పల్లిలో సిర్పుర్కర్ కమిషన్ బృందం పర్యటన
- Justice sirpurkar commission : 'నిందితులు మాపై కాల్పులు జరపడం వల్లే మేం ఫైరింగ్ చేశాం'
- disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?'
- justice sirpurkar commission: దిశ హత్యాచార కేసును శంషాబాద్ డీసీపీనే పర్యవేక్షించారు: సజ్జనార్
- Sirpurkar Commission Enquiry: దిశ కేసు.. '12 మంది కళ్లలో మట్టి కొట్టాడు'!