విద్యార్థులు తలచుకుంటే ఏదైనా సాధించగలరని అదనపు డీజీ షికాగోయల్ అన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉండాలని.. అనుకున్నది సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. ఓయూ పీజీ కళాశాల 72 వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ చాలా గొప్పదని.. సరైన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కేఎఫ్సీ వ్యవస్థాపకుడు హార్లాండ్ సండేర్స్ గురించి వివరించారు. చిన్న వ్యాపారంతో మొదలై అంచెలంచెలుగా ఎదిగాడని గుర్తుచేశారు.
విజయాలకు వయసుతో సంబంధం లేదు: షికాగోయల్ - shika goyal
జీవితంలో ఎదగాలంటే కఠోర శ్రమ, నిర్దిష్టమైన ప్రణాళిక తప్పనిసరని అదనపు డీజీ షికాగోయల్ తెలిపారు. కేఎఫ్సీ వ్యవస్థాపకుడు హార్లాండ్ సండేర్స్పై ఆసక్తికర అంశాలను విద్యార్థులకు వివరించారు. ఓయూ పీజీ కళాశాల 72 వ వార్షికోత్సవాలకు షికా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.