ETV Bharat / state

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

Adani Group Representatives Meet CM Revanth Reddy : అదానీ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. కొత్త ప్రాజెక్టులకు సహకరించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. పరిశ్రమల స్థాపనకు సంస్థ ముందుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా అదానీ పెట్టుబడులను స్వాగతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Adani Group Discuss with Revanth Reddy
Adani Group Representatives Meet CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 7:47 PM IST

Adani Group Representatives Meet CM Revanth Reddy : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఆయా కంపెనీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ఫాక్స్​కాన్, అమర రాజా, తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్​ను కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ(Karan Adani Meet Revanth Reddy) సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'

Karan Adani Meet Telangana CM Revanth Reddy : రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు, కొత్త ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలకు రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదానీ ఏరో స్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Amar Raja Company Chairman Meet CM Revanth Reddy : అమరరాజా సంస్థ(Amararaja Company) ఛైర్మన్ గల్లా జయదేవ్‌ నేడు సీఎం రేవంత్​ను మర్యాదపూరకంగా సచివాలయంలో కలిశారు. ఆ సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. గిగా కారిడార్​కు ప్రభుత్వం సహకారం అందించినందుకు అభినందనీయమని అన్నారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో 'అమర్​ రాజా' పాత్ర చాలా కీలకం - పూర్తి సహకారం అందిస్తాం: సీఎం రేవంత్‌

Foxconn Representatives Meet CM Revanth Reddy : ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని గల్లా జయదేవ్ హర్షం వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలను రాష్ట్రంలో మరింత విస్తరిస్తామని ప్రకటించారు. తమ సంస్థ దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్‌ గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫాక్స్​కాన్(Foxconn Company in Telangana) పరిశ్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్​లో చేపట్టబోయే వాటికి కూడా సహకారం అందిస్తామన్నారు.లక్ష ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

16వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలి : సీఎం రేవంత్​ రెడ్డి

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.