ETV Bharat / state

విశాఖ, హైదరాబాద్‌లో అదానీ డేటా కేంద్రాలు - విశాఖ న్యూస్ అప్​డేట్స్

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్‌ (ఈసీఎక్స్‌)తో సమాన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

విశాఖ, హైదరాబాద్‌లో.. అదానీ డేటా కేంద్రాలు

author img

By

Published : Feb 24, 2021, 9:29 AM IST

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. దేశ వ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్‌ (ఈసీఎక్స్‌)తో సమాన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా అదానీ యాజమాన్యంలో ఉన్న డీసీ డెవలప్‌మెంట్‌ చెన్నై (డీసీడీసీపీఎల్‌)లో 50 శాతం వాటాలను ఈసీఎక్స్‌ యూరప్‌ విభాగానికి విక్రయించనుంది.

ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో దేశ వాప్తంగా రానున్న పదేళ్లలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో డేటా కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని వివరించింది. చెన్నైతో ప్రారôభించి నవీ ముంబయి, నోయిడా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు ఈ ఒప్పందాన్ని విస్తరించనున్నాయి. డేటా కేంద్రాల నిర్మాణం, అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్లు సంస్థలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా అదానీకనెక్స్‌ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

ఇదీ చదవండి: విమానాల్లో గోల్డ్ స్మగ్లింగ్.. అక్రమార్కుల బిజినెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.