కీ స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన లింగం శ్రీనివాస్ తమ దగ్గర రూ.7.5 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని సీసీఎస్ పోలీసులకు సినీ నటుడు నరేశ్ ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఆ డబ్బులను... హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నారని అన్నారు.
డబ్బులు తీసుకుని ఆరేళ్లు దాటినా ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని.. ఈ విషయంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు ఓ వీడియో విడుదల చేశారు. తమకు ఇప్పటి వరకు వారి వద్ద నుంచి మొత్తం 10 కోట్ల రూపాయలు రావాలని అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారని... అందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు.. మిలియన్లలో ఫాలోవర్స్!