హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సరళి రాష్ట్ర ప్రభుత్వంపై గల వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని తెజస పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. డబ్బులతో మేనేజ్ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తున్న తెరాస పార్టీకి ఈ ఎన్నికలు గుణపాఠమని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని అన్నారు. ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్లాలని కోరారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రధాన కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసు నమోదు చేయాలని ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఆత్మస్థైర్యంతో సబ్బండ వర్గాలను కలుపుకుని పోరాడుదామన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించకపోతే మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబర్ 3న... హైదరాబాద్లో వేలాదిమంది నిరుద్యోగులతో "తెలంగాణ యూత్ డిమాండ్స్ డే" నిర్వహిస్తున్నామని తెలిపారు. యువ జన సమితి, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కరపత్రాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో... విద్యార్థి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: Bandi sanjay on sircilla incident: 'తెరాస నాయకులు ఏం చేసినా చెల్లుతుంది.. సిరిసిల్ల ఘటనే నిదర్శనం'