హైదరాబాద్లోని లాలాపేట్ రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, బిడ్డ మృతి చెందారు. నాచారానికి చెందిన కొంతమంది మహిళలు కేటీఆర్ రోడ్ షోకు హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల తల్లి రేష్మ అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. 14 నెలల పాప చికిత్స పొందుతూ చనిపోయింది. రైల్వే ట్రాక్ దాటకుండా ఏర్పాట్లు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.
ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం