ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డ్రైవర్, పీఏపై అనిశా ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు.. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీచేసింది. సమన్లు తీసుకున్నా.. ఇవాళ్టి విచారణకు గైర్హాజరయ్యారు. వారిద్దరిపై అనిశా కోర్టు బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆగస్టు 9న హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇవాళ్టి విచారణకు ఉదయ్ సింహా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీచూడండి: Jagadish Reddy: డిపాజిట్లు కోల్పోతామనే భయంతోనే దళితబంధుపై విమర్శలు