ETV Bharat / state

పుంజుకుంటున్న ఆధార్​ సేవలు.. పునఃప్రారంభమైన కార్డుల జారీప్రక్రియ

దేశంలో ఆధార్​ కార్డుల జారీ ప్రక్రియ తిరిగి పుంజుకుంటోంది. కరోనా ప్రభావంతో స్తంభించిన ఆధార్​ సేవలు క్రమంగా పునరుద్ధరణ జరుగుతున్నాయి, మరోవైపు ఆధార్​ను ప్రామాణికంగా తీసుకోవడం, వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడం అనూహ్యంగా పెరుగుతోంది.

author img

By

Published : Oct 3, 2020, 12:17 PM IST

Aadhar card services is started after lock down
పుంజుకుంటున్న ఆధార్​ సేవలు

భారత్​లో ప్రతి అవసరానికి ఆధార్‌ కార్డు ఆధారమవుతోంది. 2020 మే నాటికి 137 కోట్ల మంది జనాభా ఉంటారని అంచనా వేసిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఇప్పటి వరకు 126 కోట్ల మంది ఆధార్‌ కార్డులు పొందినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రతి నెల సగటున 20 లక్షల మంది కొత్త ఆధార్‌ కార్డులు పొందుతున్నట్లు యూఐడీఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఏప్రిల్​లో జారీ చేసింది 9వేలే...

కొవిడ్‌ మూలంగా మార్చి చివరి వారంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల ఆధార్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రతి నెల 20లక్షల మందికి జారీ అయ్యే ఆధార్‌ కార్డులు లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెలలో కేవలం తొమ్మిది వేలు మాత్రమే జారీ అయ్యాయి. ఆ తరువాత మే నెలలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో లక్షా డెబ్బైవేల ఆధార్​ కార్డులను అధికారులు జారీ చేశారు.

సెప్టెంబర్​లో 27లక్షల కార్డులు

లాక్​డౌన్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తూ రావడం వల్ల జూన్‌లో 8.36లక్షలు, జులై నెలలో 13.2లక్షలు, ఆగస్టులో 17.3లక్షల నూతన ఆధార్​ కార్డులు జారీ అయినట్లు యూఐడీఏఐ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబరు నెలలో ఏకంగా 27లక్షల నూతన కార్డులు జారీ అయ్యాయి. ఇలా క్రమంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఊపందుకుంటోందని ఈసేవ, మీసేవలతో పాటు బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లోనూ నూతన కార్డుల జారీ ప్రక్రియ క్రమంగా పెరుగుతోంది.

పెరుగుతున్న ఆధార్ అప్​డేట్​లు

ఆధార్‌ పొందిన తరువాత వివిధ రకాల వివరాలను మార్పు చేసుకునే కార్యక్రమం కూడా లాక్‌డౌన్‌ తరువాత క్రమంగా పెరుగుతోంది. ప్రతి నెల సగటున 60 నుంచి 80 లక్షల మంది తమ ఆధార్‌కార్డుల్లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో పూర్తిగా స్తంభించిన ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు...క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 54లక్షల మంది తమ ఆధార్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోగా సెప్టెంబరు నెలలో ఏకంగా 86 లక్షలకుపైగా కార్డుదారులు అప్‌డేట్‌ సేవలను వాడుకున్నట్లు ఆధార్‌ అధికారులు వెల్లడించారు. ఆధార్‌ కార్డుల జారీ నుంచి ఇప్పటి వరకు 39 కోట్ల మంది మార్పులు చేసుకున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది.

ఆధార్‌ కార్డుల జారీ నాటి నుంచి ఇప్పటి వరకు 4637.80 కోట్ల అవసరాలకు ఆధార్‌ కార్డులను ప్రామాణికంగా వాడుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నెల సగటున 90 నుంచి 100 కోట్ల వరకు ఆధార్‌ కార్డులను ప్రామాణికంగా వాడుకోవడం జరుగుతోంది. అథెంటికేషన్‌ వాడకంపై కొవిడ్‌ ప్రభావం అంతగా పడలేదు. ఆధార్‌ కార్డుల జారీ స్తంభించిన సమయంలోనూ అథెంటికేషన్‌ వాడకం ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్‌ నెలలో ఏకంగా 118.08 కోట్ల ఆధార్‌ కార్డులు అథెంటికేషన్‌ కోసం వాడకం జరిగింది. మే నెలలో 122.89 కోట్లు, జూన్‌లో 118.19 కోట్లు, జులైలో 108.44 కోట్లు, ఆగస్టులో 106.43 కోట్లు, సెప్టెంబరులో 113.75 కోట్ల లెక్కన ఆధార్‌ కార్డులను అథెంటికేషన్‌ కోసం వాడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పెరిగిన ఈ-కేవైసీ

ప్రభుత్వ, ప్రైవేటు పథకాల అమల్లో ఆధార్‌ కార్డులను కీలకంగా తీసుకోవడం వల్ల కేవైసీ వాడకం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. పింఛన్, బ్యాంకు రుణాలు. సిమ్​కార్డు, ఇళ్లు-భూముల కొనుగోళ్లలోనూ ఆధార్​ కార్డు వివరాలను అందజేయడం తప్పనిసరి. ఇక్కడ ఆధార్‌ కార్డులోని చిరునామా, పుట్టిన తేదీ, పేరు తదితర వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్లనే దీనిని ఈ-కేవైసీ అంటారని అధికారులు తెలిపారు. ప్రతి నెల ఈ-కేవైసీ కింద 8 నుంచి 9 కోట్ల కార్డులు వాడకం జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కూడా ఏప్రిల్‌ నెలలో కాస్త తగ్గినా ఆ తరువాత క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏప్రిల్‌ నెలలో 3.12 కోట్ల ఆధార్‌ కార్డులు ఈ-కేవైసీ కింద వాడటం జరిగింది. మే నెలలో 9.19 కోట్లు, జూన్‌ నెలలో 10.45 కోట్లు, జులై నెలలో 8.40 కోట్లు, ఆగస్టు నెలలో 8.81 కోట్లు, సెప్టెంబరు నెలలో 9.44 కోట్ల ఆధార్‌ కార్డులను ఈ-కేవైసీ కింద వాడినట్లు తెలిపారు. ఆధార్‌ కార్డుల జారీ నుంచి ఇప్పటి వరకు 860 కోట్ల కార్డులను ఈ-కేవైసీ ద్వారా వినియోగించినట్లు వెల్లడించారు. ఇలా రోజురోజుకు ఆధార్ కార్డుల వాడకం పెరుగుతూ.. ప్రతి విషయంలోనూ కీలకంగా మారుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.