A young woman Raped Bandlaguda in Hyderabad : సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
Bandlaguda Rape Case : తాజాగా ఓ యువతి ఇంట్లో గొడవ పెట్టుకొని హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో తనకు పోలీస్‌స్టేషన్‌కు దారి చెప్పాలని కోరింది. అందుకు సరేనన్న వారు, ఆ అమ్మాయిని బైక్‌పై ఎక్కించుకొని, ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి (Bandlaguda Rape Case) ఒడిగట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడ పీఎస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది.
మైనర్‌పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఇందుకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేటకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. శనివారం ఏదో విషయమై ఆమెకు, తన సోదరుడితో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సోదరుడు ఆ అమ్మాయిని కొట్టాడు. ఈ విషయమై మనస్తాపానికి గురైన యువతి, బస్టాండుకు వచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కింది. శనివారం రాత్రి 10:40 గంటల ప్రాంతంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)లో దిగింది.
Rape Cases in Hyderabad : బయటికి వచ్చి టీ తాగిన తరువాత అఫ్జల్‌గంజ్ వైపు నడుచుకుంటూ వస్తోంది. ఆ యువతిని చూసిన గౌస్‌నగర్‌కు చెందిన ములకలపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్‌గంజ్‌కు చెందిన పానగంటి కాశీ విశ్వనాథ్(32)లు ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎక్కడికెళ్లాలని అడగ్గా, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పింది. తాము అక్కడికే వెళ్తున్నామని, నిన్నూ తీసుకెళ్తామని చెప్పి బైకు ఎక్కమన్నారు. వారిని నమ్మిన యువతి సరేనని ద్విచక్రవాహనం ఎక్కింది.
రన్నింగ్ ట్రైన్లో రేప్.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం
కొద్దిదూరం వెళ్లాక అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ఓ ఐస్‌క్రీం పార్లర్ వద్ద నిందితులు ద్విచక్రవాహనాన్ని ఆపారు. అక్కడ యువతికి ఐస్‌క్రీం తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేశారు. తరువాత ఆ అమ్మాయిని నేరుగా బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధి లేక్‌వ్యూ హిల్స్ సమీపంలోని శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి (Rape Cases in Hyderabad) పాల్పడ్డారు. అక్కడి నుంచి మరో చోటికి తరలించేందుకు బైకుపై తీసుకెళ్తుండగా బాధితురాలు అరిచింది. దీనిని స్థానికులు గమనించడంతో నిందితులు పరారయ్యారని ఇన్‌స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ తెలిపారు.
అత్యాచారం చేసి చంపేశారు..! పాలమూరులో వెలుగుచూసిన అకృత్యం..
Rape Cases in Telangana : దీనిపై స్థానికుల సమాచారంతో చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ కె.గురునాథ్, బండ్లగూడ ఎస్సై వెంకటేశ్వర్‌జీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన స్క్రాప్ గోడౌన్‌ను ఆమె చూపించింది. ఈ గోడౌన్ శ్రీకాంత్‌దని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో కాశీవిశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారణ చేయగా ఇద్దరూ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్..
కూతురిపై కన్నతండ్రి అత్యాచారం - తప్పించుకునే క్రమంలో మరో డేంజర్లోకి