driverless tractor : ట్రాక్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది రైతులే. అయితే ట్రాక్టర్ నడపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వెనకాల ట్రాలీ ఉంటే.. మరింత జాగ్రత్తగా నడపాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటిది... అసలు డ్రైవర్‌తో పనే లేకుండా ట్రాక్టర్ దానంతట అదే నడిస్తే ఎలా ఉంటుంది..? ట్రాక్టర్‌పై రైతు కూర్చోవాల్సిన పని లేకుండా.. ట్రాక్టర్ దానంతట అదే దుక్కి దున్నేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ దృశ్యాలు.
చదివింది డిగ్రీ..
young man invents Driverless Tractor : రాజస్థాన్‌కి చెందిన యోగేష్ బీఎస్సీ పూర్తి చేశాడు. డిగ్రీ మెుదటి సంవత్సరంలో ఉన్నప్పు డు ఓ రోజు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నాన్నకు ఆరోగ్యం బాలేదు.. వెంటనే ఊరు రమ్మని ఇంట్లో వాళ్లు చెప్పారు. దగ్గర్లోని పట్టణంలో చదువుతున్న యోగేష్... వెంటనే ఇంటికి వెళ్లి ఒకవైపు తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ.. మరోవైపు పొలం పనులు చేయడం మెుదలుపెట్టాడు. దాదాపు 2 నెలలపాటూ ట్రాక్టర్‌తో పనులు చేశాడు. దాంట్లో ఉన్న కష్టం మనోడికి అర్థమైంది. డ్రైవర్ లెస్ కార్లు చూస్తున్నాం కదా, మరి అలాంటప్పుడు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన తట్టింది.
కుమారుడి ప్రతిభను నమ్మిన తండ్రి
degree student invents Driverless tractor : డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ గురించి యోగ్ తండ్రికి వివరించి.. ప్రయోగాల కోసం 2వేల రూపాయలు అడిగి తీసుకున్నాడు. తర్వాత మరికొన్ని డబ్బులు అడిగితే... ప్రాజెక్ట్ నమూనా ఓ సారి చూపిస్తే అది నమ్మశక్యంగా ఉంటే ప్రాజెక్ట్ కోసం ఎన్ని డబ్బులైనా ఇస్తానని చెప్పారు. దీంతో.. రిమోట్ కంట్రోల్‌తో బొమ్మ ట్రాక్టర్లు ఎలా నడిపిస్తామో.. అదే ఫార్ములా ఎంచుకున్నాడు. దానికి కావాల్సిన మరికొంత పరిజ్ఞానాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. అలా... తండ్రికి రిమోట్‌తో ట్రాక్టర్‌ను ముందుకూ, వెనక్కూ రిమోట్‌తో కదిలించి చూపించాడు. అది చూసిన యోగేష్ నాన్న... అప్పు చేసి మరీ 50వేలు ప్రాజెక్ట్ కోసం ఇచ్చాడు.
నమ్మకం నిలబెట్టుకున్నాడు
Tractor run with Remote : 6 నెలల పాటు వివిధ ప్రయోగాలు చేసి.. ఒకటిన్నర కిలోమీటర్ దూరం పరిధిలో రిమోట్‌తో నడిచే విధంగా ట్రాక్టర్‌ను తీర్చిదిద్దాడు. ఇది చూసిన వాళ్లు మెచ్చుకోవడంతో పాటు.. కొన్ని సందేహాలు లెవనెత్తారు. ట్రాక్టర్‌తో వ్యవహారం కొంచెం అదుపుతప్పితే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఊరిపెద్దలు.. పొలాల్లో మాత్రమే ఉపయోగించాలి. రోడ్డుపై కాదంటూ పరిమితులు మెుదట్లో విధించారు. క్రమంగా దీని పనితీరు చూసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యోగేష్ ప్రతిభను మెచ్చుకోవడంతో పాటు తమ పొలాల్లో డ్రైవర్ లెస్ ట్రాక్టర్ వినియోగించడం పెరిగిపోయింది.
పేటెంట్ కోసం దరఖాస్తు..
అలా.. 2017లోనే ఈ డ్రైవర్ లెస్ ట్రాక్టర్ రూపుదిద్దుకున్నా.. ఈ మధ్యనే యోగేష్ దీని పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల... యాంటీ-టీహెచ్ఈఎఫ్టీ (THEFT) అలారమ్ తయారు చేశాడు. ఈ పరికరం.. అనుమతి లేని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తే మనకు ఎస్ఎంఎస్ (SMS) లేదా కాల్ వచ్చేట్లు తయారు చేశాడు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఇన్నోవేషన్ తండ్రి కోసం చేశాడు. ఇదే స్ఫూర్తితో... భారత ఆర్మీ కోసం మున్ముందు ఈ తరహా వాహనాలు రూపొందిస్తా అంటున్నాడు యోగేష్.
ఇదీ చూడండి : hyderabad paper girls: హైదరాబాదీ పేపర్ గర్ల్స్ కథ విన్నారా..!