ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ల నడుమ ట్వీట్స్ వార్(ktr and raja singh tweets) సాగుతోంది. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఓల్డ్ సిటీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ బైక్పై పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్(mla raja singh challenge to minister ktr) సవాలు విసిరారు. చిన్నపాటి వర్షానికి ఓల్డ్ సిటీ ప్రాంతంలో రహదారులు, దుకాణాలు, ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు.
ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని(ktr challenge to mla raja singh) మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్పీజీ ధరలపైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. భాజపా పాలనలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడమా? అంటూ ప్రశ్నించారు. మాటల గారడీ ఆపి మంచి పనులతో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని రీట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: kishan reddy About Huzurabad by poll: భాజపా గెలుపు ఖాయం.. అదే అధికార మార్పునకు సంకేతం..