ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. ఓడరేవు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తుండగా.. సముద్ర అలల్లో తీరానికి కొట్టు కొచ్చిన వింత చేప కంటపడింది. పరిశీలించగా ఆ వింత చేపకు మూడు కళ్లు ఉన్నాయని.. ఆకారం విచిత్రంగా ఉందని.. నీళ్లల్లో వేస్తే రబ్బరులాగా సాగుతోందని వివరించారు.
సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు వివిధ రకాల చేపలు చూస్తుంటామని.. ఈ రకం వింత చేపను చూడటం ఇదే మొదటిసారని ఓడరేవు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప క్వారల్స్ రకానికి చెందిన వింత జీవి అని మత్స్య శాఖ విశ్రాంత జేడీ బలరామ్ తెలిపారు.