హైదరాబాద్ మాదాపూర్‌లోని అలంకృతి ఆర్ట్ గ్యాలరీలో ఒడిశా ప్రముఖ చిత్రకారుడు ప్రదోష స్వైన్ జోడియాక్ చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈనెల 28 వరకు కొనసాగే ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు చిత్రకారులు పాల్గొన్నారు. ప్రదోష జోడియాక్‌పై వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చిత్రకారిణి సంగీతశర్మ అన్నారు. విభిన్న కోణంలో, విభిన్న శైలిలో ప్రదోష చిత్రాలను వేశారని ఆమె తెలిపారు.
దిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చిత్రకారులు ప్రదోష స్వైన్ పేర్కొన్నారు. యువ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు తమ చిత్రాలను ఏర్పాటు చేశారని గ్యాలరీ నిర్వాహకురాలు ప్రశాంతి తెలిపారు. ఈ చిత్ర ప్రదర్శనలో దాదాపు 24 చిత్రాలు కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఇదీ చూడండి : నాగర్‌కర్నూలు మున్సిపాలిటీల్లో సమస్యల స్వాగతం