ETV Bharat / state

కొత్త రకం మాదక ద్రవ్యాలతో అక్రమార్కుల నయా దందా - హసీస్​ ఆయిల్​ అక్రమ రవాణా తాజా వార్తలు

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల్లో అక్రమార్కులు రోజుకో కొత్త తరహా విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటి వరకు కొకైన్‌, హెరాయిన్‌, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ వంటి వాటిని విక్రయించే ముఠాలు.. తాజాగా హ‌సీస్ ​ఆయిల్‌ దిగుమతిపై దృష్టి సారించినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్‌ దాడుల్లో దొరికే మాదక ద్రవ్యాలతో పోల్చితే ఈ ఆయిల్‌ అరుదైనదిగా అధికారులు చెబుతున్నారు.

A new type of drug smuggling in the state
కొత్త రకం మాదక ద్రవ్యాలతో అక్రమార్కుల నయా దందా
author img

By

Published : Jun 22, 2020, 2:23 PM IST

రాష్ట్ర రాజధానికి కొత్త తరహా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతోంది. బెంగుళూరు, చెన్నై, ముంబై, దిల్లీ లాంటి మెట్రో నగరాల నుంచి పార్శిళ్ల ద్వారా కొత్త తరహా మాదక ద్రవ్యాలు దిగుమతి అవుతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి ఆకుల నుంచి తీసిన హ‌సీస్​ ఆయిల్‌ తెచ్చి.. అక్రమార్కులు విక్రయాలు సాగిస్తున్నట్లు ఆదివారం అమీర్​పేటలో పట్టుబడిన మాదక ద్రవ్యాల సరఫరా ముఠా ద్వారా వెల్లడి కావడం వల్ల ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది.

నిందితులు ఈ ఆయిల్​ను బోరబండ నివాసి ఆదిత్య వద్ద కొనుగోలు చేసినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఔషధాల పేరిట ఈ ఆయిల్​ను నగరానికి తెప్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న ఆదిత్య వద్ద భారీగా హ‌సీస్​ ఆయిల్‌ ఉండొచ్చని ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ విభాగం భావిస్తోంది.

హ‌సీస్ ఆయిల్​ దందాలో అధిక లాభాలున్నట్లు గుర్తించి.. నిందితులు ఈ ఆయిల్‌ సరఫరాపై దృష్టిసారించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. విశాఖ ఏజెన్సీ నుంచి ఈ ఆయిల్​ను తెప్పిస్తున్నట్లు తెలిసింది. అక్కడ లీటర్​ రూ.50 వేల నుంచి రూ. 60 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో డిమాండ్​ను బట్టి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు అమ్ముతారని వెల్లడైంది. ఈ ఆయిల్​ను సిగిరెట్లకు పైపూత పూసి వాడొచ్చని.. లీటర్​ ఆయిల్‌తో దాదాపు రూ. 3 లక్షల వరకు ఆర్జించవచ్చని తెలిసింది. గంజాయి కంటే అధికంగా మత్తు ఇచ్చే ఈ ఆయిల్​ను ఎక్కువ మంది ఇష్టపడతారని తెలుసుకున్న అక్రమార్కులు.. ఈ దందాపై దృష్టి సారించారు.

పట్టుబడిన ముఠా సభ్యుల ఫోన్‌లలోని నంబర్లను, వాట్సాప్‌ సంక్షిప్త సమాచారాలను ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి.. ఎప్పటి నుంచి ఈ అక్రమ మాదక ద్రవ్యాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు తదితర వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ముగ్గురితో పాటు పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

ఇదీచూడండి: బినామీ ఖాతా తీగలాగితే.. సైబర్‌ నేరగాళ్ల గుట్టురట్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.