ETV Bharat / state

ఫీజుల నియంత్రణకు పరిష్కారం చూపని నూతన విద్యావిధానం

author img

By

Published : Aug 1, 2020, 6:48 AM IST

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులకు జాతీయ నూతన విధానంలో పరిష్కారం చూపకపోవండపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థలు తాము చేసిన ఖర్చు ప్రకారమే రుసుములు తీసుకోవచ్చని చెప్పడం వల్ల వ్యయాన్ని భారీగా చూపి అధిక ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫీజుల నియంత్రణకు పరిష్కారం చూపని నూతన విద్యావిధానం
ఫీజుల నియంత్రణకు పరిష్కారం చూపని నూతన విద్యావిధానం

విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే పాఠశాలల ఫీజులు తలుచుకొని అత్యధిక శాతం మంది తల్లిదండ్రుల గుండెలు అదురుతుంటాయి. ప్రైవేట్‌ పాఠశాలల ఫీ'జులుం'కు మాత్రం జాతీయ నూతన విద్యా విధానంలో పరిష్కారం చూపకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. విద్య వ్యాపారం కాదని.. ప్రజాసేవ అని చెప్పిన కేంద్రం విద్యా వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించే విధానాన్ని మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. ఉన్నత విద్యా సంస్థలు తాము చేసిన ఖర్చు ప్రకారమే రుసుములు తీసుకోవచ్చని చెప్పడం వల్ల వ్యయాన్ని భారీగా చూపి అధిక ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాఠశాల విద్యలో ఫీజుల గురించి ఏముందంటే?

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే రాష్ట్ర పాఠశాలల ప్రమాణాల సాధికార సంస్థ(ఎస్‌ఎస్‌ఎస్‌ఏ)కు బడుల్లోని మౌలిక వసతులు, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలి. వాటిని ఆ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా బహిరంగపరుస్తుంది. యాజమాన్యాలు వెల్లడించే వివరాలపై ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థుల అభిప్రాయాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు తరచూ సేకరిస్తారు. విద్యా నాణ్యత కోసం కృషి చేసే దాతలను ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులు పెంచకుండా నియంత్రించవచ్చు.

ఉన్నత విద్యలో రుసుముల గురించి..

నియమ నిబంధనలపై వివిధ యంత్రాంగాలు దృష్టి సారిస్తే ఉన్నత విద్యలో విద్యా వ్యాపారాన్ని నియంత్రించవచ్చు. విద్యా సంస్థలు ఆదాయ, వ్యయాలను బహిరంగపరచాలి. న్యాక్‌ అక్రిడేషన్‌ ఆధారంగా గరిష్ఠంగా వసూలు చేయాల్సిన రుసుమును అధికార యంత్రాంగం నిర్ధారిస్తుంది. కళాశాలలు తాము వసూలు చేసే ఫీజులు, ఇతర ఛార్జీలను చెప్పాలి. విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజును మధ్యలో ఇష్టారాజ్యంగా పెంచరాదు.

లొసుగులు ఎన్నో...

* ఆ విద్యా సంవత్సరంలో చేసిన వ్యయం ఆధారంగా ఫీజులను నిర్ధారించడం ఇప్పుడు జరుగుతున్న విధానమే. పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు వ్యయాన్ని అధికంగా చూపిస్తూ తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎఫ్‌ఆర్‌సీ)కి ఆడిట్‌ నివేదికలు సమర్పిస్తున్న ఉదంతాలు ఎన్నో. దానికితోడు భవనాలు, స్థలాల అద్దె అధికంగా చూపడం, తమ కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన వాటిని తీసుకొని అధిక అద్దె చెల్లిస్తున్నట్లు చూపిస్తున్న పాఠశాలలు కూడా తక్కువేం కాదు. అలాంటి పలు యాజమాన్యాల ఆడిట్‌ నివేదికలను హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) నాలుగేళ్ల క్రితమే బట్టబయలు చేసింది. ఇక సిబ్బంది వేతనాల్లో పలు యాజమాన్యాలు ఎన్నో గిమ్మిక్కులు చేస్తున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ... రికార్డుల్లో ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు చూపుతున్నాయి. సగం వేతనం వెనక్కి ఇవ్వాలని ఇటీవల ఓ ఇంజినీరింగ్‌ కళాశాల కార్యాలయ ఉద్యోగి ఓ అధ్యాపకుడిని అడుగుతున్న వాయిస్‌ రికార్డులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

* ఇక ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, దాతలు నడుపుతున్న వాటిని ప్రోత్సహించడం ద్వారా ప్రైవేట్‌ ఫీజులను నియంత్రించవచ్చని కేంద్రం చెబుతున్నా అందుకు తగ్గ బడ్జెట్‌ను ప్రభుత్వాలు కేటాయిస్తాయా అన్నది ప్రశ్న. ‘ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయిన రుసుముల నియంత్రణపై పరిష్కారం చూపకపోవడం దారుణం’ అని హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధి ఆశిష్‌ వ్యాఖ్యానించారు. ‘ అధిక రుసుములు ఉంటే తల్లిదండ్రులు భరించలేరు... తక్కువ వసూలు చేస్తే నాణ్యమైన విద్య అందదు. దీనిపై లోతుగా చర్చించి జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి’ అని ఓయూ మాజీ ఉపకులపతి, ఫీజుల నియంత్రణ, సూచనల కోసం రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్మన్‌ ఆచార్య తిరుపతిరావు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.