హైదరాబాద్ తిరుమలగిరిలోని అయోధ్యనగర్లో సాయి, హేమలత దంపతులు నివాసం ఉంటున్నారు. సాయి ఓ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి సమయంలో మూత్రవిసర్జనకు నిద్ర లేచాడు. అప్పుడే భవనంపైన పెద్ద శబ్దం రావడం వల్ల ఇంట్లో వారు అతని భార్య హేమలత నిద్రలోంచి లేచి బాత్రూంలో చూడగా అతను కనిపించలేదు.
భవనం పై నుంచి కిందకు చూడగా అతను విగతజీవిగా రక్తపుమడుగులో కనిపించాడు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. మద్యం మత్తులోనే అతను భవనంపై నుంచి కింద పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!