ETV Bharat / state

భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రాజ్యసభకు నామినేషన్..! - హైదరాబాద్ తాజా వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం తన భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారంటూ ఓ వ్యక్తి రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తీన్మార్ మల్లన్నతో కలిసి ఈరోజు అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకున్నారు.

తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న
author img

By

Published : May 13, 2022, 4:01 PM IST

ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం తన భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారంటూ మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. హన్వాడకు చెందిన చిన్న మాసయ్య ఈరోజు అసెంబ్లీ కార్యాలయంలో రాజ్యసభ నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. ఆయన వెంట తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు.

మాసయ్యతో పాటు సుమారు 2వేల మంది దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. న్యాయం కోసం నామినేషన్ వేసేందుకు సిద్ధమైన మాసయ్యకు భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దుతు ఇవ్వాలని ఆయన కోరారు.

"పుడ్ ప్రాసెసింగ్ పార్కు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2వేల మంది దళితులకు చెందిన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది. వారు తమ భూములను కాపాడాలని మాదగ్గరికి వచ్చారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభకు నామినేషన్ వేయించాలని నిర్ణయించాం. అందులో భాగంగా నామినేషన్ పత్రాలు తీసుకున్నాం. దీనికి భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలి." -తీన్మార్‌ మల్లన్న

ఇదీ చదవండి: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం సమీక్ష

కాంగ్రెస్​కు 'లీకుల' భయం.. 'చింతన్ శిబిర్​'లో ఫోన్లు బ్యాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.