హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కందికల్గేట్ సమీపంలోని దుర్ధన హోటల్ పక్కన ఉన్న బావిలో గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించగా వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.
అనుమానాస్పద మృతి
పొస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35 నుంచి 40 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'