ఆంధ్రప్రదేశ్ జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం కూడలిలో స్కోడా కారు అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటకు దిగి... సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ కారు మంటల్లో ఆహుతైపోయింది.
ఇదీ చదవండి: కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్