ETV Bharat / state

భాగ్యనగరంలో కొత్తగా రానున్న మరికొన్ని డివిజన్లు - జనాభా లెక్కలు ప్రాతిపదికన డివిజన్లు తాజా వార్త

హైదరాబాద్​ మహానగర రాజకీయ చిత్రం త్వరలో మారనుంది. జీహెచ్ఎంసీ కొత్త చట్టం వచ్చాక .. నగరంలో ప్రస్తుతమున్న 150 డివిజన్లను 180కి పైగా పెంచే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక అమలు చేస్తారని అంటున్నారు.

a-few-more-divisions-will-be-added-in-hyderabad-soon
భాగ్యనగరంలో కొత్తగా రానున్న మరికొన్ని డివిజన్లు
author img

By

Published : Mar 1, 2020, 6:37 AM IST

Updated : Mar 1, 2020, 7:27 AM IST

హైదరాబాద్​ మహా నగర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. జీహెచ్​ఎంసీ కొత్తచట్టం వచ్చాక రాజధానిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. కనీసం ప్రతి 50 వేల మంది జనాలకు ఓ డివిజన్​ ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం 150 డివిజన్ల పరిధిలో దాదాపు కోటి మంది జనాభా ఉండటం గమనార్హం. ఆ లెక్కన డివిజన్లు 180 నుంచి 200కు పెరిగే అవకాశముంది. నవంబరు వరకు ఈ ప్రక్రియను ముగించి, వెంటనే జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేయాలనేది ప్రణాళిక.

ఇప్పటిదాకా జరిగిందేమిటంటే

హైదరాబాద్​ మహానగర పాలక సంస్థ 2007లో ఆవిర్భవించింది. చుట్టూ ఉన్న 12 పురపాలక సంస్థల విలీనంతో మహానగరంగా అవతరించింది. 2009లో 150 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. పాలక మండలి గడువు 2014లో ముగిసింది. అప్పటికే గ్రేటర్​లో డివిజన్లను పెంచాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. 2001 జనాభా లెక్కలతో 2009లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరిగాయని, 2011 లెక్కల ప్రకారం గ్రేటర్​లో 67 లక్షల మందికి 172 డివిజన్లు ఉండాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ బాధ్యతను సర్కారు బల్దియాకు అప్పగించింది. సగటున 40 వేల మంది జనాభా ప్రాతిపదికన 172 డివిజన్లు అవసరమవుతాయని బల్దియా కమిషనర్​​... ప్రభుత్వానికి తెలిపారు.

పునర్విభజన తర్వాతే ఎన్నికలు

సర్కారు.. డివిజన్లను పెంచకుండాసగటున ఒక్కో డివిజన్​లో 40 వేల మంది జనాభా ఉండేటట్లు చూసింది. కొత్త సరిహద్దులను నిర్ణయించింది. 2016 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైంది. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి, 2021తో పూర్తవనుంది. అప్పటికి ఆరు నెలల ముందే కొత్త జీహెచ్​ఎంసీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి అనంతరం ప్రతి 50 వేల మందికి ఒకటి చొప్పున డివిజన్ల పునర్విభజన చేపట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. నవంబరు వరకు ఆ ప్రక్రియను ముగించి.. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

2021 జనాభా లెక్కలు 2024లో అందుబాటులోకి వస్తాయని అందువల్ల 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్ల పునర్విభజన జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్

Last Updated : Mar 1, 2020, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.