హైదరాబాద్ మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మస్తాన్నగర్ బస్తీలో ఓ వ్యక్తి మద్యం మత్తులో గన్తో హల్చల్ చేశాడు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తిని అంటూ స్కార్పియో వాహనంలో వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. TS 04 EX 7777 వాహనంలో వచ్చిన వ్యక్తి స్థానిక కాలనీల నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దారి లేక వాహనాన్ని నిలిపాడు.
జనం పోగవడం వల్లే...
అక్కడే ఓ శుభకార్యం జరుగుతుండగా వారిని చూసి ఆయుధం చూపిస్తూ స్థానికులను బెదిరిస్తూ హల్చల్ చేశాడు. బస్తీవాసులు అందరు గుమిగూడటం వల్ల అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు మందుబాబు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'