ETV Bharat / state

కరోనా అల్లకల్లోలం: పడక వచ్చింది.. ప్రాణం పోయింది

author img

By

Published : May 11, 2021, 12:52 PM IST

మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆయాసం తగ్గకపోవడంతో... సోమవారం ఏపిలోని విజయవాడలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన కరోనా బాధితుడు మృతి చెందాడు. విజయవాడకు చెందిన దూపగుంట్ల లక్ష్మణ రావు కొవిడ్ బారిన పడటంతో ఓపీ రాయించి 3 గంటలు వేచి చూశాక.. పడక ఖాళీ అయింది. రోగిని లోపలికి తీసుకెళ్లాక ఆరోగ్యం విషమించి మృతి చెందడం ఆస్పత్రి వర్గాల్లో కలకలం రేపింది.

Bed Confirmed
Bed Confirmed

ఏపీలోని విజయవాడకు చెందిన దూపగుంట్ల లక్ష్మణరావు కొవిడ్​ బారిన పడటంతో మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆయాసం ఎక్కువైంది. సోమవారం నగరంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీ రాయించి మూడు గంటలు వేచి చూశారు... పడక ఖాళీ అయింది.. ఈ క్రమంలో రోగిని లోపలికి తీసుకురమ్మని కబురు వచ్చింది.

బోరుమన్న కుటుంబీకులు..

లోనికి తీసుకెళ్లేలోపే ద్వారం వద్ద లక్ష్మణరావు ప్రాణం పోయింది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆసుపత్రి బయటే మరో మూడు గంటలు మృతదేహం వద్ద కూర్చుండిపోయారు. మృతదేహానికి పంచనామా చేయాల్సినవారు ఎవరూ రాలేదు. దీంతో ఆటోలో ఇంటికి తీసుకెళ్లిపోయారు.

ఇదీ చూడండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.