Case Registered Against MP Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదైంది. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్గొండలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్.. ఆయన కుమారుడిపై వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు తాను భావోద్యేగంతోనే చేసినవని.. వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
MP Komati Reddy Venkat Reddy Update News: చెరుకు సుధాకర్ మాత్రం ఆ అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుధాకర్ కుమారుడు సుహాస్ నిన్న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని సుహాస్ వివరించారు. చంపుతానంటూ ఫోన్‌లో బెదింరించినట్లు చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ ఒకటో పట్టణ పీఎస్‌లో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది.
కోమటిరెడ్డి వివరణ: ఇటీవల చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్‌తో తాను మాట్లాడిన మాటలు.. భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలేనని.. తనకు వేరే ఉద్దేశం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. 33 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ తన రాజకీయ ప్రత్యర్థులు, ఇతరులపై కానీ దూషణలు చేయలేదని స్పష్టం చేశారు. శత్రువులను కూడా దగ్గరకు తీసే తత్వం తనదన్న అయన.. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.
నల్గొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినా.. మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాలకు దక్కేలా చూశానని అయన వివరించారు. తాను మాట్లాడిన విషయాలు కట్ చేసి, కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేసారని పేర్కొన్నారు. రికార్డు పెట్టారని తనకు తెలుసని, పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతున్నాడని ఆరోపించారు. తనను సస్పెండ్ చేయాలని అనడం వల్లే బాధతో మాట్లాడినట్లు వివరించారు.
నకిరేకల్‌లో తనపై పోస్టర్లు వేశారని.. ఎవరు వేశారో తనకు తెలుసన్నారు. తమ వాళ్లు చంపేస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పినట్లు పేర్కొన్న ఆయన.. తనపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రేకు ఫిర్యాదు చేషినట్లు వివరించారు.
ఇవీ చదవండి: