ETV Bharat / state

కూకట్​పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య - businessman mohan

కూకట్​పల్లిలో దారుణం జరిగింది. ఓ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోవడం వల్ల  భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కూకట్​పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య
author img

By

Published : Aug 14, 2019, 7:32 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం ఐదో అంతస్తు నుంచి దూకి మోహన్​ అనే వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం పటాన్​చెరు మండలం కర్దనూర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. తన కారు ఢీ కొట్టినందుకే ఈ ప్రమాదం జరిగిందన్న భావనతో మోహన్​ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇవాళ ఉదయం...

స్నేహితులతో కలిసి వ్యాపారి మోహన్​ పటాన్​చెరులోని గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వాహనం నడిపి ఒకరి ఉసురు తీశాడు. ప్రమాదానంతరం కారును అక్కడే వదిలేసి కూకట్​పల్లికి వచ్చిన మోహన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అపరాధ భావంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కూకట్​పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య
ఇదీ చూడండి: భార్యతో సంబంధం పెట్టుకున్నాడని హత్య...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.