రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,61,728కి చేరింది. కొవిడ్‌తో తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,423కు పెరిగింది. వైరస్ నుంచి కొత్తగా 1,057 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 2,47,790 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 12,515 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 10,245 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 154 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 84, రంగారెడ్డి జిల్లాలో 70 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: బల్దియాలో డిజిటల్ ప్రచారం.. సోషల్ వారియర్స్ దూకుడు