రాష్ట్రంలో మరో 858 మంది కరోనా బారినపడినట్లు వైద్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,08,617 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 858 మందికి వైరస్ నిర్ధరణ అయింది. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 6,25,237కు చేరింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 9 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,678కి చేరింది. మరో 1,175 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 12,726 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా కేసుల్లో ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 30, జీహెచ్ఎంసీ 107, జగిత్యాల 18, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులాంబ గద్వాల 5, కామారెడ్డి 3, కరీంనగర్ 51, ఖమ్మం 81, కుమురం భీం ఆసిఫాబాద్ 4, మహబూబ్నగర్ 18, మహబూబాబాద్ 40, మంచిర్యాల 41, మెదక్ 7, మేడ్చల్-మల్కాజిగిరి 39, ములుగు 18, నాగర్కర్నూల్ 12, నల్గొండ 64, నారాయణపేట 4, నిర్మల్ 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 36, రాజన్న సిరిసిల్ల 22, రంగారెడ్డి 51, సంగారెడ్డి 12, సిద్దిపేట 23, సూర్యాపేట 52, వికారాబాద్ 10, వనపర్తి 7, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 39, యాదాద్రి భువనగిరి 15 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చూడండి: 'అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలను ఎలా నిర్మిస్తున్నారు'