ETV Bharat / state

4రోజుల్లో సుమారు రూ.760 కోట్ల మద్యం తాగేశారు.. - Details of liquor sales for the new year

రాష్ట్రంలో నూతన సంవత్సర పార్టీలు, వేడుకలకు అనుమతి లేకపోయినా మందు బాబులు ఇళ్లలోనే మద్యాన్ని మంచి నీళ్లలా తాగేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 760కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. డిసెంబర్‌ 31న మందు బాబుల వల్ల ప్రమాదాలు జరగకుండా పోలీసులు విస్తృతంగా డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు..

నాలుగు రోజుల్లో సుమారు 760 కోట్ల మద్యం స్వాహా

author img

By

Published : Jan 1, 2021, 7:39 AM IST

నాలుగు రోజుల్లో సుమారు 760 కోట్ల మద్యం స్వాహా

రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మందు బాబులు మద్యం మత్తులోనే 2020కి వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల్లోనే 759 కోట్ల విలువైన మద్యం తాగేశారు. 8.61 కోట్ల లిక్కర్‌ కేసులు , 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 200 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. డిసెంబర్‌ 28న 205.18 కోట్లు, 29న 150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31న193 విలువైన మద్యాన్ని మంచి నీళ్లలా తాగేశారు. ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 300 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్‌ జిల్లాలో 50.78కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో 47.78కోట్లు, మెదక్‌ జిల్లాలో 53.87కోట్లు, నల్గొండ జిల్లాలో 75.98కోట్లు, నిజామాబాద్‌ జిల్లాలో 37.5 కోట్లు, వరంగల్ జిల్లా జిల్లాలో 63.49 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు అనుమతించకపోయినా గతేడాది కంటే ఈసారి మద్యం అమ్మకాలు భారీగానే జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు, పార్టీలకు అనుమతివ్వని పోలీసులు.... ప్రమాదాల నివారణకు ఎక్కడికక్కడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో బేగంపేట ఫ్లైఓవర్ మినహా, తెలుగుతల్లి , బషీర్ బాగ్ , నారాయణగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్లు మూసి వేశారు. టాంక్​బండ్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు తీగల వంతెన పైకి రాత్రి వాహనాలను అనుమతించలేదు. డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలను పరిశీలించిన సీపీ సజ్జనార్‌... మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని సూచించారు. ఈ ఏడాది సురక్షిత డ్రైవింగ్‌తో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.