సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన 71వ ఎన్‌సీసీ డే వేడుకలు అలరించాయి. ఈ ఉత్సవాలకు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ చలపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణతో కూడుకున్న ఎన్‌సీసీ శిక్షణ కెడెట్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు కెడెట్లతో గౌరవవందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా దివ్యాంగుల కవాతు ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో శత్రువులు చేసే బాంబుదాడులు, తూటాలకు నెరవకుండా శత్రువులను మట్టికరిపించే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గుర్రాల స్వారీ, సాహస సన్నివేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఔరా అనిపించారు.
ఇదీ చూడండి : 'స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్యపై రివ్యూ పిటిషన్