ETV Bharat / state

7.5 శాతం ఫిట్‌మెంట్ ఆమోదయోగ్యం కాదు: పీఆర్టీయూ - telangana varthalu

వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన 7.5 శాతం ఫిట్‌మెంట్‌.. ఎట్టిపరిస్థితుల్లో సమ్మతం కాదని పీఆర్టీయూ తేల్చి చెప్పింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ రెండోరోజూ ఉద్యోగసంఘాలతో సమావేశమైంది. చర్చలకు హాజరైన పీఆర్​టీయూ ప్రతినిధులు... తమ సమస్యలను సభ్యుల ముందుంచారు.

7.5 శాతం ఫిట్‌మెంట్ ఆమోదయోగ్యం కాదు: పీఆర్టీయూ

author img

By

Published : Jan 28, 2021, 1:27 PM IST

పీఆర్సీ ప్రతిపాదించిన ఏడున్నర శాతం ఫిట్​మెంట్​ ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని... 45 శాతంతో వేతన సవరణ ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. కమిషన్ నివేదికపై పీఆర్టీయూతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలు, వినతులను తీసుకున్నారు. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున కోరుకున్న పీఆర్సీ సాధ్యం కాదని కమిటీ వారికి తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఇన్నాళ్లు ఓపిక పట్టామన్న పీఆర్టీయూ ప్రతినిధులు... మళ్లీ ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే మంచి వేతన సవరణ ఇవ్వాలని కోరారు.

కేంద్రం తరహాలో పిల్లల చదువుల కోసం నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఒప్పంద ఉపాధ్యాయులు లేకుండా నియామకాలు చేపట్టాలని కోరారు. పీఆర్సీ నివేదికపై తమ అభ్యంతరాలు తెలిపామన్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి... ఉద్యోగులను సంతోష పెట్టకుండా వారిని ఇబ్బంది పెడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్​కు గురువులపై అమితమైన ప్రేమ ఉందన్న ఆయన... గురువులకు తగిన వేతనం, సౌకర్యాలు కల్పించాలని కోరారు.

7.5 శాతం ఫిట్‌మెంట్ ఆమోదయోగ్యం కాదు: పీఆర్టీయూ

ఇదీ చదవండి: రాష్ట్ర పోలీస్‌శాఖలో 38 శాతం ఉద్యోగుల కొరత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.