ETV Bharat / state

'69 ఏళ్ల వయసులో ఆ బామ్మ సత్తా చూడండి'

author img

By

Published : Jun 5, 2020, 3:27 PM IST

ఒకటి.. రెండు.. మూడు.. మహా అయితే నాలుగు! ఒక వ్యక్తి నడపగలిగే వాహనాల సంఖ్యది. ఒక మహిళ అవలీలగా 20 రకాల భారీ వాహనాలు నడిపించగలదు. అదీ 69 ఏళ్ల వయసులో! ఆ బామ్మ సత్తాకు మనం చేతులెత్తి మొక్కాల్సిందే.

69 ఏళ్ల వయసులో ఆ బామ్మ సత్తా చూడండి
69 ఏళ్ల వయసులో ఆ బామ్మ సత్తా చూడండి

కేరళలోని తొప్పుంపాడీలో టి.కె.రాధామణి అంటే తెలియని వాళ్లుండరు. మొత్తం కేరళలోనూ ఆమె పరిచయమే. ద్విచక్రవాహనం నుంచి రోడ్డురోలర్‌ దాకా ఇరవై రకాల భారీ వాహనాలను అలవోకగా నడిపేస్తారు ఈ వృద్ధురాలు. లారీ, బస్‌, ఎర్త్‌మూవర్‌, ఫోర్క్‌లిఫ్ట్‌, మొబైల్‌ క్రేన్‌, పెద్ద క్రేన్‌లాంటి వాటిని పరుగెత్తించడం ఆమె చిటికెలో పని. ఆమె దగ్గర 11 రకాల మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఉన్నాయి.

ఒక్క యాక్సిడెంట్‌ కూడా చేయలేదు..

రాధామణి 1981లో మొదటిసారి లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకున్నారు. 1988లో హెవీ మోటార్‌ డ్రైవింగ్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొందారు. ఆ సమయంలో ఈ లైసెన్స్‌ తీసుకున్నవాళ్లు రాష్ట్రం మీద ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్లు. 1978లో రాధామణి భర్త తొప్పుంపాడీలో డ్రైవింగ్‌ శిక్షణాకేంద్రం ఏర్పాటు చేశారు. ఆమె సరదాగా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లొస్తుండేవాళ్లు. ఆపై ఇష్టంతో భారీ వాహనాలు నడపడం నేర్చుకున్నారు. డ్రైవింగ్‌పై పట్టు సాధించారు. 32 ఏళ్ల సర్వీసులో ఆమె ఒక్కటంటే ఒక్క యాక్సిడెంట్‌ కూడా చేయలేదు.

ఇవీ చూడండి: కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.