ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాని కన్సల్టెన్సీగా నియమించింది. ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై సెప్టెంబర్ చివరి వరకు నివేదిక అందజేయనున్నారు. దాని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి.
ఈ నెల 19 నుంచి 3 రోజుల పర్యటన
అధ్యయనంలో భాగంగా జులైలో అధికారుల బృందం వరంగల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లో ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించింది. రెండో దశలో ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో పర్యటించనుంది.
ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల అవసరం ఉందా...? ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుంది...? ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థలం ఎంత ఉంది. ఉన్నది సరిపోతుందా...? పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన ప్రాంతాల్లో ఎంత స్థలం అవసరం...? ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి...? విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలమా... కాదా...? అనే అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి