ETV Bharat / state

మరో 54 మంది బాల కార్మికులకు విముక్తి - Rachakonda_Cp_On_Muskan

ఆపరేషన్​ ముస్కాన్​లో 54 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. బాలాపూర్​ పీఎస్​ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న గాజుల పరిశ్రమల్లో సోదాలు చేసి పోలీసులు బాల కార్మికులను రక్షించారు.

54 మంది బాల కార్మికులకు విముక్తి
author img

By

Published : Jul 16, 2019, 7:35 PM IST

Updated : Jul 16, 2019, 7:57 PM IST

అత్యంత దయనీయ పరిస్థితుల్లో పనిచేస్తున్న 54మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. బాలాపూర్ పీఎస్​ పరిధిలోని హబీబ్‌నగర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గాజుల పరిశ్రమల్లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట సోదాలు చేసి బాల కార్మికులను రక్షించినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వీరంతా బిహార్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని... పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల ఒకటి నుంచి 15 వరకు మొత్తం 176 మంది బాలకార్మికులను రక్షించినట్లు మహేష్ భగవత్ వివరించారు.

54 మంది బాల కార్మికులకు విముక్తి

ఇవీ చూడండి: రాజధానిలో మళ్లీ వర్షం పడింది...

sample description
Last Updated : Jul 16, 2019, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.