ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి (covid cases in ap). వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు . దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,356 కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 584 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,276 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,655 యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: medical students wearing helmets: హెల్మెట్లు ధరించిన జూనియర్ వైద్యులు