ETV Bharat / state

4 Years Girl Suspicious Death in Medchal : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 4 ఏళ్ల చిన్నారి - auto driver murder case in hyderabad

Girl Suspicious Death in Kushaiguda : నాలుగు సంవత్సరాల చిన్నారి నిద్రపోయి.. మళ్లీ కళ్లు తెరవలేదు. ఎందుకని ఆసుపత్రికి తీసుకువెళ్తే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పాప అనుమానాస్పద మృతి పట్ల చిన్నారి తండ్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో జరిగింది. మరో ఘటనలో ఓ ఆటో డ్రైవర్​ దారుణ హత్యకు గురయ్యాడు.

4 years child Suspicious death in Medchal

author img

By

Published : Jul 2, 2023, 6:54 PM IST

4 years child Suspicious death in Medchal : నాలుగేళ్ల పాప భోజనం చేసి పడుకుంది. కొంత సమయానికి కళ్లు తెరుస్తుందని తల్లి అనుకుంది. కానీ శాశ్వతంగా కళ్లు మూసేసిందని తెలిసి కన్నీరుమున్నీరైంది. చిన్నారిని బతికించాలని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పాప అసలు ఎందుకు మృతి చెందిందో తెలియక ఆ తల్లి మరింత శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి కుమార్తె అనుమానాస్పద మృతిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : మేడ్చల్​ జిల్లా కుషాయిగూడకు చెందిన నాయకవాడి రమేశ్​​, కల్యాణిని 2018లో ప్రేమ విహహం చేసుకున్నాడు. వారికి పాప తన్విత(4) జన్మించింది. వారి మధ్య కుటుంబ కలహాల కారణంగా 2021 నుంచి కల్యాణి పాపతో సహా తన సొంత ఇంట్లో జీవిస్తోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది. సాయంత్రం ఎంతసేపైనా నిద్రలో నుంచి లేవలేదు. దీంతో బాలిక తల్లి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని పోస్టుమర్టానికి తరలించారు. అయితే.. బాలిక అనుమానాస్పద మృతి పట్ల పాప తండ్రి స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. పాప మధ్యాహ్నం తినే ఆహారంలో ఏమైనా విషతుల్యం అయిందా..? చిన్నారి నిద్రలో చనిపోడానికి కారణాలు ఏంటి..? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా..? ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Live video on Car Accident At LB Nagar : డ్రైవర్​ నిర్లక్ష్యం.. కారు డోర్​ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి

Auto Driver Murder in Hyderabad : హైదరాబాద్​లో మరో ఘటనలో ఓ ఆటో డ్రైవర్​ దారుణ హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్​ల మధ్య జరిగిన గొడవ తీవ్రం కావడంతో ఒకరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్ పోలీస్​ స్టేషన్‌ పరిధిలోని హాఫీజ్‌పేటలో శనివారం అర్ధరాత్రి కొంత మంది ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. వీరి మధ్య జరిగిన గొడవ ఎక్కవ అవ్వడంతో.. అఖిల్ అనే ఆటో డ్రైవర్‌ను తోటి డ్రైవర్లు హత్య చేశారని పోలీసులు తెలిపారు. అఖిల్ బోరబండలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటారని పేర్కొన్నారు. బాధితుడు ఓ పాత కేసులో నిందితుడుగా ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.