ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ అవార్డులు - ఇంధన పొదుపు విషయంలో  దక్షిణ మధ్య రైల్వే 4 జాతీయ అవార్డులు

ఇంధన పొదుపు విషయంలో దక్షిణ మధ్య రైల్వే 4 జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులను సీఐఐ ఈ నెల 18న తన వార్షిక సమావేశాల్లో ప్రకటించినట్లు ద. మ. రైల్వే తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ అవార్డులు
author img

By

Published : Sep 21, 2019, 9:12 AM IST

ఇంధన పొదుపు చర్యలకు ఫలితంగా 2019 సంవత్సరానికి గాను దక్షిణ మధ్య రైల్వే నాలుగు జాతీయ అవార్డులను సాధించింది. కాన్పడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఏటా ప్రకటించే ఈ అవార్డులకు మొత్తం జోనల్ రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నా... ద. మ. రైల్వేకి అత్యధిక అవార్డులు రావడం విశేషం. ఇంధన పొదుపును పెంచేందుకు సీఐఐ ఈ అవార్డులను ఇస్తుంది. ఈ పోటీలలో భవనాల విభాగంలో మొట్టమొదటి సారిగా పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని రైల్ నిలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లేఖ భవన్, సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయం భవనాలకుగాను 4 అవార్డులను సాధించినట్లు ద. మ. రైల్వే తెలిపింది. ఈ నెల 18న సీఐఐ వార్షిక సమావేశాల్లో ఈ అవార్డుల్ని ప్రకటించగా సంబంధిత అధికారుల్ని జోన్​ జనరల్​ మేనేజర్​ గజానన్​ మాల్య అభినందించారు.

ఇదీ చూడండి: 'చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.