ETV Bharat / state

కరోనాపై అధ్యయనానికి రాష్ట్రానికి 4 బృందాలు - 4 Centre teams to the state Latest News

కొవిడ్-19 తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లోని పురపాలికల్లో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్రం బృందాలు 15 రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి 4 బృందాలు తరలివచ్చాయి.

కరోనాపై అధ్యయనానికి రాష్ట్రానికి 4 బృందాలు

author img

By

Published : Jun 10, 2020, 6:50 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 50 పురపాలికల్లో పరిస్థితులను అధ్యయనం చేసి స్థానిక ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రత్యేక బృందాలను పంపింది. వీటిలో తెలంగాణకు నాలుగు బృందాలు రానున్నాయి. ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులుంటారు.

ఇందులో ఒకరు కేంద్ర ప్రభుత్వంలోని సంయుక్త కార్యదర్శి హోదా గల అధికారి కాగా మరో ఇద్దరు వైద్యరంగ నిపుణులు ఉంటారు. ఈ బృందాలు తమకు కేటాయించిన మున్సిపాలిటీ పరిధిలోని ఆస్పత్రులను పరిశీలిస్తాయి. అక్కడ అమలు చేయాల్సిన కట్టడి చర్యలు, రోగులకు అందించాల్సిన వైద్య సేవలు, కేసుల నిర్వహణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు ఇస్తాయి.

ఎంత మందిని పరీక్షించాలి..

వర్గాలు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో, వేగంగా పనిచేయడం, సూక్ష్మస్థాయి ప్రణాళికలు అమలు చేయడానికి చేయూతనందిస్తాయి. క్షేత్రస్థాయిలో నిఘా, నియంత్రణ, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన పనులను మరింత సమర్థంగా అమలు చేయడంపై సూచనలు ఇవ్వనున్నాయి. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతి 10 లక్షల మందిలో ఎంత మందిని పరీక్షించాలి, నిర్థారణ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో మార్గదర్శనం చేయనున్నాయి.

ఏ రాష్ట్రానికి ఎన్ని బృందాలు :

మహారాష్ట్ర - 7

తమిళనాడు- 7

అసోం-6

రాజస్థాన్-5

ఒడిశా-5

మధ్యప్రదేశ్- 5

బిహార్- 4

తెలంగాణ- 4

ఉత్తర్ ప్రదేశ్- 4

హరియాణ- 4

కర్ణాటక- 4

గుజరాత్- 3

ఉత్తరాఖండ్- 3

పశ్చిమ్ బంగా- 3

దిల్లీ- 3

ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.