ETV Bharat / state

3PM TOPNEWS: టాప్​న్యూస్@3PM - 3PM TOPNEWS

ఇప్పటివరకున్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Apr 21, 2022, 2:58 PM IST

  • కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. అదే విధంగా కౌలు రైతుల రక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

  • తెరాస కౌన్సిలర్‌ దారుణ హత్య..

మహబూబాబాద్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. 8వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ రవిని దుండగులు నరికి చంపారు. ద్విచక్రవాహనంపై బాబునాయక్‌ తండాలోని తన ఇంటి నుంచి మహబూబాబాద్‌కు వస్తుండగా... మార్గమధ్యలో పత్తిపాక వద్ద ఆగారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్‌ రవిపై దాడి చేసిన దుండగులు.. గొడ్డలితో నరికి పారిపోయారు.

  • అనిశా వలలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

జీహెచ్​ఎంసీ శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళికాధికారి నరసింహరాములు నివాసంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. నరసింహరాములపై ఏసీబీకి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

  • ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడు

ఏపీలోని విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రాజాంలో పాలకొండ రోడ్డులోని డోలపేట జంక్షన్ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

  • ఇక నుంచి మెట్రో రైడ్​ ఆటోలు..

మెట్రో రైల్​ ప్రయాణికులకు మెట్రో రైడ్​ పేరుతో ఎలక్ట్రిక్​ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి. మెట్రో స్టేషన్​ నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా మెట్రో ఫేజ్​ 2 నిర్మాణంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

  • పెళ్లికి డబ్బులు లేవని కూతురినే చంపిన తండ్రి

పెళ్లి చేయడానికి డబ్బులు లేవనే కారణంతో కన్న కూతురినే హత్య చేశాడు ఓ తండ్రి. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాందేడ్​లో జరిగింది.

  • ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీం

జహంగీర్​పురిలో అక్రమ నిర్మాణల కూల్చివేతలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను మేయర్‌కు తెలియజేసిన తర్వాత కూడా.. కూల్చివేతలు జరగడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.

  • సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన బ్రిటన్​ ప్రధాని

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు.

  • రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం..

టీమ్​ఇండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. 2022 ఏడాదికి గానూ 'విజ్డెన్ ఫైవ్ క్రికెటర్స్​ ఆఫ్​ ఇయర్'​ జాబితాలో వారికి స్థానం లభించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. 'లీడింగ్​ క్రికెటర్ ఇన్​ ది వరల్డ్​'గా నిలిచాడు.

  • బిడ్డ పుట్టాక కాజల్​ ఫస్ట్ పోస్ట్​..

బిడ్డ పుట్టాక హీరోయిన్​ కాజల్​ అగర్వాల్ తొలిసారి స్పందించింది. ఇన్​స్టా వేదికగా​ ఓ భావోద్వేగపు పోస్ట్ చేసింది. మరోవైపు గ్లోబల్​ స్టార్ ప్రియాంక చోప్రా తన కూతురు పేరును సోషల్​మీడియా ద్వారా తెలిపింది. దాని అర్థాన్ని కూడా వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.