ETV Bharat / state

3D MAPPING: బోనాల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 'త్రీడీ మ్యాపింగ్​'

బోనాల విశిష్టతను చాటిచెప్పేలా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​, చిత్రదర్గా వద్ద ఏర్పాటు చేసిన త్రీడీ మ్యాపింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నుల పండువగా ఉన్న మ్యాపింగ్​ను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఇక నుంచి పండుగలు, ఇతరత్రా ఉత్సవాల సమయంలో ఈ త్రీడీ మ్యాపింగ్​ను కొనసాగించనున్నారు.​

3D MAPPING
3D MAPPING
author img

By

Published : Jul 26, 2021, 9:13 AM IST

ఆదివారం జరిగిన సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని బోనాల విశిష్టతను చాటిచెప్పేలా సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ మ్యాపింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంజలి థియేటర్‌ సమీపంలోని చిత్రదర్గాతో పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద త్రీడీ మ్యాపింగ్‌ నిర్వహించారు. స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పండుగలు, ఇతరత్రా ఉత్సవాల సమయంలో త్రీడీ మ్యాపింగ్‌ కొనసాగించనున్నారు.

బోనాల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 'త్రీడీ మ్యాపింగ్​'

తెలంగాణలో ప్రధానంగా జరపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ సంస్కృతికి సంప్రదాయాల‌కు నిలువెత్తు నిద‌ర్శనం. బోనాల్లో పోతురాజుల విన్యాసం, ఘ‌టాల ఊరేగింపు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి. వేలాది మంది భ‌క్తులు ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారికి బోనాలు స‌మ‌ర్పిస్తారు. బోనాల వేడుకల్లో పలు కార్యక్రమాలు ఉంటాయి. ఘటోత్సవంతో ప్రారంభమైన వేడుక.. రంగం తర్వాత ఊరేగింపుతో ముగుస్తుంది.

కొవిడ్​ నిబంధనల నడుమ ఆదివారం లష్కర్‌ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుటుంబం అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలంతా ఉదయాన్నే పట్టుచీరలు కట్టుకుని ముత్తైదువుల్లా అలంకరించుకుని బోనమెత్తి అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలివచ్చారు. పిల్లాపెద్దలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

కరోనాను అమ్మ తొలగిస్తుంది..

"సికింద్రాబాద్​లో కలరా వచ్చినప్పుడు ఓ వ్యక్తి ఉజ్జయినిలో అమ్మవారిని దర్శించి.. కలరా తగ్గితే సికింద్రాబాద్​లో ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. అలా మొక్కుకోగానే ఇక్కడ ఆ వ్యాధి తగ్గింది. ఆ వ్యక్తి మొక్కు ప్రకారం.. ఈ గుడిని కట్టించారు. అప్పట్లో కలరాను తగ్గించిన అమ్మవారు.. ఇప్పుడు కరోనాను కూడా తగ్గిస్తారు. ఇది నా నమ్మకం. ప్రజలంతా కూడా అమ్మవారినే నమ్ముకుంటున్నారు. అందుకే కరోనా భయమున్నా.. అమ్మను దర్శించుకోవడానికి తరలివచ్చారు."- భక్తురాలు

నేడు రంగం..

బోనాల మ‌రుసటి రోజు అనగా నేడు రంగం ఉంటుంది. ఆల‌య మండ‌పంలో జోగినిగా మారిన స్త్రీ అమ్మవారి వంకే చూస్తూ.. అమ్మవారి క‌ళ‌ను ఆవ‌హించుకుని భ‌విష్యత్తులో జ‌రిగే ప‌రిణామాల‌ను చెబుతుంది. ఈమెనే మాతాంగి అంటారు. ఈ మొత్తం కార్యక్రమాన్నే రంగం అంటారు. దీన్ని ప్రత్యక్షంగా వేలాది భ‌క్తులు, ప‌రోక్షంగా ల‌క్షలాది మంది భ‌క్తులు వీక్షిస్తుంటారు. రంగం త‌ర్వాత అమ్మవారి చిత్రప‌టాన్ని ప్రత్యేకంగా అలంక‌రించిన ఏనుగుపై ఉంచి మంగ‌ళ‌ వాద్యాలు, క‌ళాకారులు, ఆట‌పాట‌ల‌తో ఊరేగించుకుంటూ సాగ‌నంప‌డంతో బోనాల సంబురం ముగు‌స్తుంది. ఈసారి ఆలయ పర్యవేక్షకుల సమక్షంలోనే ఇది జరగనుంది.

ఇదీ చూడండి: Lashkar Bonalu : లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.