ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఇప్పటి వరకు మెుత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. గడచిన 24 గంటల్లో 9 వేల 256 మంది నుంచి నమూనాలు సేకరించారు. 68 మందికి కరోనా నిర్ధరణ కాగా అందులో 36 మంది రాష్ట్ర వాసులే ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 32 మందికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రకు చెందిన 29, ఒడిశాకు చెందిన ఇద్దరు, బంగా వాసి మరొకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా నుంచి కోలుకుని 1192 మంది డిశ్ఛార్జి కాగా... 860 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఓ వ్యక్తి మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్యం 48కి చేరింది.
- జిల్లాల వారీగా కొత్త కేసులు
నెల్లూరు | 15 |
చిత్తూరు | 9 |
గుంటూరు | 5 |
కడప | 2 |
కృష్ణా | 2 |
శ్రీకాకుళం | 2 |
పశ్చిమ గోదావరి | 1 |
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాల్లో 'కూలీ'న బతుకులు- 16 మంది మృతి