ETV Bharat / state

మాస్కుల పేరుతో 30 లక్షలు కొట్టేశారు.. ముఖం చాటేశారు - మాస్కుల ఆర్డర్ 30 లక్షలు మోసపోయిన వ్యాపారవేత్త

సైబర్​ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మారుతున్న కాలంతోపాటు సైబర్​ నేరగాళ్లు మారుతున్నారు. మాస్కుల కోసం ఓ వ్యాపారవేత్త ఆర్డర్​ చేయగా ముందే డబ్బు చెల్లించాలన్నారు. 30 లక్షల రూపాయలు చెల్లించాక ముఖం చాటేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

30 lakhs cheating cyber crime at hyderabad
30 లక్షలు కొట్టేశారు.. ముఖం చాటేశారు
author img

By

Published : Jun 28, 2020, 8:40 AM IST

మాస్కుల కోసం ఆర్డర్ చేసిన ఓ వ్యాపారవేత్త రూ.30 లక్షలు మోసపోయాడు. హైదరాబాద్ అబిడ్స్​కి చెందిన అశోక్ అగర్వాల్ యూరప్​కు చెందిన ఆగ్రో బయో కంపెనీకి మెయిల్ ద్వారా ఆర్డర్ చేశాడు. తనకు రూ.60 లక్షల విలువైన మాస్కులు కావాలని కోరాడు.

కంపెనీ వారు చెప్పిన విధంగా ముందుగా 30 లక్షల రూపాయలు అడ్వాన్స్​గా ఆన్​లైన్ ద్వారా పే చేశాడు. తర్వాత మాస్కులు రాకపోవడం, కంపెనీ వారు స్పందించకపోవడం వల్ల మోసపోయానని తెలుసుకున్నాడు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : అతడి కోసం మావో అగ్రనేతల కసరత్తు.. ఇంతకీ ఎవరి కోసం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.