ETV Bharat / state

తాత్కాలిక సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేసిన ఆర్టీసీ - Rtc_Workers_Contract_To_Regular

తెలంగాణ ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన తాత్కాలిక సిబ్బందిని రెగ్యులరైజ్​ చేసినట్లు ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు.

ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ జారీ
ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ జారీ
author img

By

Published : Dec 7, 2019, 10:21 PM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. డిసెంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 296 మంది ఒప్పంద డ్రైవర్లు, 63 మంది ఒప్పంద కండక్టర్లను రెగ్యులర్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

'సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులరైజ్'.

రెగ్యులర్ చేసే తేదీ నాటికి 240 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సునీల్​ శర్మ పేర్కొన్నారు. ఒప్పంద కార్మికులను సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులరైజ్ చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతీ 12 రోజులకు ఒక సెలవు, వార్షిక ఇంక్రిమెంట్, కుటుంబ సభ్యులకు బస్ పాస్ సౌకర్యం, ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. డ్రైవర్లకు ప్రారంభ వేతనం రూ.13,780లు, కండక్టర్లకు (గ్రేడ్ -2) ప్రారంభ వేతనం రూ.12,610లతో పాటు అలవెన్స్​లు అందజేస్తామని ఆర్టీసీ ఇన్​ఛార్జి ఎండీ సునీల్​ శర్మ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి'

TG_HYD_68_07_RTC_WORKERS_CONTRACT_TO_REGULAR_AV_3182388 reporter : sripathi. srinivas ( ) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సందర్బంగా ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటామని హామినిచ్చారు. ఈమేరకు 296 మంది ఒప్పంద డ్రైవర్లను, 63 ఒప్పంద కండక్టర్లను రెగ్యులర్ నియామకం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ చేసే తేదీ నాటికి విధుల్లో చేరినప్పటి నుంచి 240 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒప్పంద కార్మికులను సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులరైజ్ చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యుగులకు ప్రతి 12 రోజులకు ఒక సెలవు, వార్షిక ఇంక్రిమెంట్, కుటుంబసభ్యులకు బస్ పాస్ సౌకర్యం, ఆర్జీత సెలవులు నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. డ్రైవర్లకు ప్రారంభ వేతనం రూ.13,780లు, కండక్టర్లకు (గ్రేడ్ -2) ప్రారంభ వేతనం రూ.12,610లతో పాటు అలవెన్స్ లు అందజేయబడతాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.