2024-25 Academic Year BTech Computer Science, IT Seats Increase : రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరం నాటికి మరిన్ని బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 75 శాతానికి పైగా ఉండగా, ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరగనుంది. ఇప్పటి వరకు సీట్ల సంఖ్యపై పరిమితి విధించిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) దాన్ని ఎత్తివేసింది. గైడ్‌లైన్స్ పాటించే కళాశాలలకు ఒక బ్రాంచీకి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడం లేదు. ఎన్‌బీఏ గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు పెంచవచ్చు.
National Board of Accreditation : యూజీసీ స్వయం ప్రతిపత్తి(న్యాక్) ‘ఏ’ గ్రేడ్ 30 శాతం కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు, వరుసగా అయిదేళ్లపాటు 80 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకు మూడేళ్ల పాటు అనుమతులు మంజూరు చేయడమే కాదు పరిమితికి మించి ఎక్కువ సీట్లను ఇస్తారు. ముఖ్యంగా సీట్లకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, బోధించే వారు ఉంటే చాలు. 2024-25 కళాశాలల అనుమతుల నిబంధనావళిలో ఈ విషయాన్ని పొందు పరచడం దరఖాస్తుల ప్రక్రియ మొదలు కావడంతో కళాశాలలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నూతన కోర్సులు, సీట్లు కావాలని అప్లై చేసుకుంటే ఏఐసీటీఈ నియమించే నిపుణుల సందర్శన కమిటీ (ఈవీసీ) కళాశాలను చెక్ చేస్తుంది.
పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో... నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022
College of Engineering Seats : పెంచుకునే సీట్లకు అవసరమైన బోధన గదులు, కంప్యూటర్లు, లెక్చరర్లను కళాశాలలు చూపాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా 70 శాతం కింద 83,766 బీటెక్ సీట్లు ఉండగా అందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 56,811 సీట్లున్నాయి. అంటే అది 68 శాతంతో సమానం. ఇక తెలంగాణలో ఉన్న ఐదు ప్రైవేట్ వర్సిటీలు, గీతం, కేఎల్, చైతన్యలాంటి డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లను కలిపితే 75 శాతం వరకు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
1500 సీట్లు కొత్తగా అందుబాటులోకి
రాబోయే సంవత్సరానికి సీట్లు పెంచుకోవడానికి ఏఐసీటీఈ నిబంధనలు న్యాక్ ఏ గ్రేడ్, స్వయం ప్రతిపత్తి లాంటివి కలిగి ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్‌లు 50 వరకు ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోనే 46 వరకు అటానమస్ కళాశాలలు ఉండటం గమనార్హం. కనీసం సగం కళాశాలలు అంటే 50 శాతం వరకు దరఖాస్తు చేసుకుని ఒక్కొ సెక్షన్ కింద పెంచుకున్నా 1500 సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.